అమెరికాలోని న్యూ ఆర్లియన్స్‌లో బుధవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. న్యూ ఇయర్‌ను పురస్కరించుకొని వేడుకలు జరుపుకుంటుండగా ఓ కారు దూసుకురావడంతో 10 మంది మరణించగా 30 మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ తప్పించుకోవడంతో పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.