ఘోర ప్రమాదం.. ఆటో, స్కూల్ బస్సులను ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు (వీడియో)

59చూసినవారు
గుజరాత్‌లోని సూరత్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన ఓ ప్రైవేట్ బస్సు ఓ ఆటోను, తర్వాత స్కూల్ బస్సును ఢీకొట్టింది. ఈ క్రమంలో బస్సు ఢీకొని పాదచారి మృతి చెందాడు. ఈ ఘటన మొత్తం అక్కడి సీసీ టీవీలో రికార్డయింది. తొలుత ఆటోను ఢీకొట్టిన బస్సు కొంతదూరం ఈడ్చుకెళ్లింది. తర్వాత ఎదురుగా వస్తున్న స్కూల్ బస్సును ఢీకొంది. అయితే విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

సంబంధిత పోస్ట్