ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

76చూసినవారు
ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
వెస్ట్ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 23 మంది ప్రయాణికులతో శనివారం చిలిగురి నుంచి గ్యాంగ్ టెక్ వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో 15 మంది తీవ్రగాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

సంబంధిత పోస్ట్