‘స్నాప్‌చాట్’ యాప్ డౌన్లోడ్ కు తండ్రి నిరాకరణ.. కుమార్తె ఆత్మహత్య

68చూసినవారు
‘స్నాప్‌చాట్’ యాప్ డౌన్లోడ్ కు తండ్రి నిరాకరణ.. కుమార్తె ఆత్మహత్య
మహారాష్ట్రలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. తన ఫోన్‌లో ‘స్నాప్‌చాట్’ యాప్ డౌన్‌లోడ్ చేయవద్దని తండ్రి చెప్పాడని ఓ మైనర్ ఆత్మహత్య చేసుకుంది. థానే జిల్లా డోంబివాలి ప్రాంతంలోని నీల్జేలో నివాసముంటున్న ఓ తండ్రి తన 16 ఏళ్ల కుమార్తెకు ఫోన్ కొనిచ్చారు. ఆమె ఆ ఫోన్‌లో ‘స్నాప్‌చాట్’ డౌన్‌లోడ్ చేసుకోవాలని చూడగా తండ్రి నిరాకరించారు. దీంతో మనస్థాపానికి గురైన బాలిక శుక్రవారం ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్