రాజస్థాన్‌లో జరిగిన విషాద ఘటనలో యువ పవర్ లిఫ్టర్ మృతి చెందింది. బికానేర్‌లో మహిళా పవర్ లిఫ్టర్ యశ్తికా ఆచార్య (17) మెడపై 270 కిలోల రాడ్ పడటంతో ప్రాణాలు కోల్పోయింది. జిమ్‌లో సాధన చేస్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, యశిక్త గతంలో జూనియర్ నేషనల్ గేమ్స్‌లో స్వర్ణపతక విజేతగా నిలిచింది.