కుంభమేళాకు వచ్చి దేశవ్యాప్తంగా ఫేమస్ అయిన మోనాలిసా 'ది డైరీ ఆఫ్ మణిపుర్' మూవీలో నటిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం ప్రారంభానికి ముందే నిలిచిపోయేలా కనిపిస్తోంది. డైరెక్టర్ సనోజ్ మిశ్రా తాగుబోతని సినీ నిర్మాత జితేంద్ర ఆరోపించారు. 'సినిమా అవకాశాలిస్తానని అమ్మాయిలను ముంబైకి తీసుకెళ్లి అనుచితంగా ప్రవర్తిస్తాడు. అతని ఒక్క సినిమా విడుదల కాలేదు. మోనాలిసాను వాడుకుంటున్నాడు' అని జితేంద్ర పేర్కొన్నారు. దీనిని మిశ్రా ఖండించారు.