సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ ఎద్దుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంది. ఈ వీడియోలో ఓ ఎద్దు వివాహ వేడుకలో రచ్చ రచ్చ చేసింది. హఠాత్తుగా లోపలికి ప్రవేశించి అక్కడున్నవారికి కంగారు పుట్టించింది. ఎద్దుకు భయపడి అక్కడున్నవారు పరుగులు పెట్టారు. ఎవరిపై దాడి చేస్తుందో అనుకుంటూ బిక్కుబిక్కుమని గడిపారు. ఈ వీడియో చూసిన చాలామంది నవ్వుకుంటున్నారు.