నిన్నటితో ITR ఫైల్ చేసేందుకు గడువు ముగిసింది. అయితే ట్యాక్స్ పేయర్లకు మరో అవకాశం ఇచ్చేందుకు కేంద్రం సానుకూలంగా లేనట్లు తెలుస్తోంది. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసినవారు దాన్ని 30రోజుల్లోపు ఈ-వెరిఫికేషన్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఈ-వెరిఫికేషన్ చేస్తే రీఫండ్ వస్తుంది. రీఫండ్ స్టేటస్ ను incometax.gov.inలో చెక్ చేసుకోవచ్చు. ITRకు సంబంధించి సమస్యలుంటే 18001030025 లేదా 18004190025 నంబర్లను సంప్రదించవచ్చు.