లారీలో మంటలు.. డ్రైవర్ సజీవ దహనం (వీడియో)

72చూసినవారు
TG: హైదరాబాద్‌లో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. మియాపూర్ నుంచి బండ్లగూడకు వెళ్తున్న లారీ, మంగళవారం అర్థరాత్రి గౌడవెళ్లి సమీపంలో ఓఆర్ఆర్‌పై అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో లారీలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో లారీ పూర్తిగా దగ్ధమవ్వడంతో.. లారీ డ్రైవర్ సందీప్(27) స్పాట్‌లోనే సజీవదహనమయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్