తొలి ఎయిర్ ఫ్లైయింగ్ కారు టెస్ట్ విజయవంతం అయిందని అమెరికాలోని అలెఫ్ ఎరోనాటిక్స్ అనే ఎలక్ట్రికల్ కార్ల తయారీ సంస్థ తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోను ఆ సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో రోడ్డుపై ఉన్న మరో కారు మీది నుంచి కారు ఫ్లై చేస్తూ వెళ్లింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.