స్మార్ట్‌ఫోన్ ప్రియులకు ఆపిల్ నుంచి శుభవార్త వచ్చేసింది. ఇప్పటికే భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా మార్కెట్‌లోకి వచ్చిన iPhone 16e సేల్ ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా ఈ మోడల్‌పై దాదాపు రూ.10 వేల తగ్గింపు ఆఫర్ ప్రకటించారు. బ్యాంక్ డిస్కౌంట్, ఎక్సేంజ్ బోనస్ కలిపి రూ.10 వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చని ప్రకటించింది. ఆపిల్, ఇండియాలో రూ.59,900 ప్రారంభ ధరకు సేల్ చేయనున్నారు.