ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో ప్రముఖ ఆధ్యాత్మిక సేవాసంస్థ ‘ఇస్కాన్’ పారిశ్రామికవేత్త అదానీ గ్రూపుతో కలిసి ప్రతినిత్యం లక్షమంది భక్తులకు భోజనాలు సమకూరుస్తోంది. తమ శిబిరాల్లో ఈ భోజనాలు వండి, ప్రయాగ్‌రాజ్‌లోని 40 కేంద్రాలకు చేరవేస్తున్నట్లు ఇస్కాన్ డైరెక్టర్ మధుకాంత్ దాస్ తెలిపారు. ఆహారం పంపిణీకి అదానీ గ్రూపు వంద వాహనాలు, వాలంటీర్లను సమకూర్చిందని పేర్కొన్నారు.