TG: నిజామాబాద్ జిల్లా వర్ని మండలం కోటయ్య క్యాంపస్‌లోని ఎస్సీ సంక్షేమ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయింది. దీంతో 23 మంది విద్యార్దులు అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్లో పప్పు అన్నం తిన్న విద్యార్దులు, ఉదయం 11 గంటలకు వాంతులు చేసుకున్నారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.