కాళేశ్వరం బ్యారేజీల విషయంలో కమిటీ ఏర్పాటు

77చూసినవారు
కాళేశ్వరం బ్యారేజీల విషయంలో కమిటీ ఏర్పాటు
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆనకట్టలకు తాత్కాలిక చర్యలు, తదుపరి పరీక్షలు.. ఇందుకోసం చేపట్టాల్సిన కార్యాచరణ కోసం కమిటీ ఏర్పాటు చేసింది. ఎన్డీఎస్‌ఏ నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా చేపట్టే చర్యల కోసం ఈఎన్‌సీ జనరల్‌ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులుగా ఓఅండ్‌ఎం ఈఎన్‌సీ, సీడీవో సీఈ, రామగుండం సీఈని నియమించింది.

సంబంధిత పోస్ట్