భారత మాజీ క్రికెటర్ కేదార్ జాదవ్ మంగళవారం భారతీయ జనతా పార్టీలో చేరారు. ముంబయిలోని మెరైన్ డ్రైవ్ వద్ద ఉన్న బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్బంగా మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి చంద్రశేఖర్ బవాన్‌కులే ఆయకు స్వాగతం పలికారు. ఇక గతేడాది జాదవ్ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లకు రిటైర్‌మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.