భారతరత్న, పద్మవిభూషణ్, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి వర్ధంతి నేడు. 1924లో డిసెంబరు 25న గ్వాలియర్ గ్రామంలో కృష్ణ బిహారీ వాజపేయి, కృష్ణా దేవి దంపతులకు ఆయన జన్మించారు. మూడు సార్లు ప్రధానిగా, పది సార్లు లోక్‌సభకు, రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో 2018 ఆగస్టు 16న మరణించారు.