27న వేలానికి మాజీ యువరాణి డయానా వ్యక్తిగత లేఖలు

52చూసినవారు
27న వేలానికి మాజీ యువరాణి డయానా వ్యక్తిగత లేఖలు
బ్రిటన్‌ మాజీ యువరాణి డయానాకు సంబంధించిన కొన్ని వస్తువులను ఈ నెల 27న వేలం వేయనున్నారు. ఇందులో ఆమె తన వ్యక్తిగత సహాయకుడికి రాసిన లేఖలు కూడా ఉన్నాయి. డయానా తన వ్యక్తిగత విషయాలు, తన జీవితంలోని మధుర క్షణాలు, పలు అనుభవాలను లేఖల్లో పంచుకొన్నారని స్థానిక మీడియా వెల్లడించింది. డయానాకు 1981లో ప్రిన్స్‌ చార్లెస్‌తో వివాహం అయింది. 1996లో ఆమె విడాకులు తీసుకొన్నారు. మరుసటి ఏడాది 36 ఏండ్ల వయసులో డయానా కారు ప్రమాదంలో మరణించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్