నన్ను జైలుకు పంపితే రాజకీయ ప్రకంపనలు: ట్రంప్

55చూసినవారు
నన్ను జైలుకు పంపితే రాజకీయ ప్రకంపనలు: ట్రంప్
తనకు జైలు శిక్ష విధించడాన్ని తన మద్దతుదారులు జీర్ణించుకోలేకపోవచ్చని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తనని జైలుకు పంపితే రాజకీయ ప్రకంపనలు, హింసాత్మక ఘటనలు తప్పకపోవచ్చని పరోక్షంగా సంకేతమిచ్చారు. తనకు మాత్రం వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బందిలేదని చెప్పుకొచ్చారు. శృంగార తార స్టార్మీ డానియల్స్‌కు డబ్బు చెల్లింపు కేసులో ట్రంప్ దోషిగా తేలిన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్