లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో వాహనదారులకు కేంద్రం భారీ షాకిచ్చింది. దేశవ్యాప్తంగా పెరిగిన టోల్ ఛార్జీలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. 2025 మార్చి 31 వరకు ఇవి అమల్లో ఉంటాయి. ఈ మేరకు ఉత్తర్వులు రిలీజ్ అయ్యాయి. కాగా, ప్రస్తుతం ఉన్న టోల్ ఛార్జీలపై సుమారు 5 శాతం పెరగనున్నట్లు ఎన్‌హెచ్ఏఐ వెల్లడించింది. టోల్‌చార్జీలు పెంచేందుకు కేంద్రం కొన్నాళ్ల క్రితమే నిర్ణయించినా, ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేశారు.