యూట్యూబ్ మాజీ సీఈవో సుసాన్ డయాన్ వోజ్కికీ (56) క్యాన్సర్ తో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆమె భర్త డెన్నిస్ ట్రాపర్ వెల్లడించారు. యూఎస్ కు చెందిన సుసాన్ 2014 నుండి 2023 వరకు యూట్యూబ్ సీఈవోగా పనిచేశారు. ఆమె మృతిపై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె రెండేళ్లుగా క్యాన్సర్ తో బాధపడుతున్నారని పేర్కొన్నారు.