త్వరలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమ్‌ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తాజాగా మరో హామీని ప్రకటించారు. తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశ రాజధానిలోని అద్దె ఇళ్లల్లో నివసించే వారికి కూడా ఉచిత విద్యుత్, నీరు అందిస్తామని పేర్కొన్నారు. పూర్వాంచల్‌కు చెందిన అనేక మంది కౌలుదారులకు సైతం ఉచిత విద్యుత్, నీటి సౌకర్యాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.