ప్రాసెస్డ్ ఫుడ్ ఫ్రెంచ్ ఫ్రైస్‌కి వీలైనంత దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ధూమ, మద్యపానం కంటే ఇవి మరింత డేంజర్ అని చెబుతున్నారు. ‘ఆలూ అనేదే కార్బోహైడ్రేట్లతో కూడుకున్నది. మధుమేహ బాధితులకు అనారోగ్యకరం. ఇక ఆ ఫ్రైస్‌ను వేపిన నూనెను అప్పటికే ఎన్నిసార్లు వేడి చేసి ఉంటారో లెక్క కూడా ఉండదు. ఆ నూనెతో ఫ్రైస్‌లో ట్రాన్స్‌ఫ్యాట్స్ తీవ్రంగా పెరుగుతాయి. ఇవి గుండెకు అత్యంత ప్రమాదకరం’ అని హెచ్చరించారు.