ఇక నుంచి సిగ్నల్ లేకున్నా ఫోన్ మాట్లాడొచ్చు

67చూసినవారు
ఇక నుంచి సిగ్నల్ లేకున్నా ఫోన్ మాట్లాడొచ్చు
ఫోన్ సిగ్నల్ లేకుంటే.. కాల్స్ మాట్లాడడం చాలా కష్టం. ఇక నుంచి నెట్‌వర్క్ లేకపోయినా కూడా కాల్స్‌ చేసుకునేందుకు టెలికాం శాఖ అవకాశం కల్పించనుంది. ఇటీవలే టెలికాం శాఖ డిజిటల్‌ భారత్‌ నిధిలో భాగంగా ICR ను లాంచ్‌ చేసింది. దీని ద్వారా BSNL, ఎయిర్‌టెల్‌, జియో యూజర్లకు ప్రయోజనం చేకూరనుంది. ఉదాహరణకు మీరు జియో సిమ్ వాడుతుంటే.. మీరున్న చోట ఆ సిగ్నల్ లేకుంటే వేరే నెట్‌వర్క్ టవర్‌ల ద్వారా కాల్స్ చేసుకోవచ్చు. అయితే దీనిని ఈ ఏడాది మే నెల నాటికి అందుబాటులోకి తీసుకురానుంది.

సంబంధిత పోస్ట్