బుద్ధవనం మరింత అభివృద్ధి: జూపల్లి

73చూసినవారు
బుద్ధవనం మరింత అభివృద్ధి: జూపల్లి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో బుద్ధవనాన్ని పర్యాటక, ఆధ్యాత్మిక డెస్టినేషన్ సెంటర్‌గా తీర్చిదిద్దుతానని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. టూరిజం ప్రమోషన్‌లో భాగంగా నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ.. బౌద్ధ టూరిజం సర్క్యూట్‌లో బుద్ధవనాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామన్నారు. నాగార్జునసాగర్‌ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం వల్ల ఆదాయంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్