రామోజీ రావు మరణం తీరని లోటు: రోజా

71చూసినవారు
రామోజీ రావు మరణం తీరని లోటు: రోజా
రామోజీ రావు మరణంపై మాజీ మంత్రి ఆర్కే రోజా X వేదికగా స్పందించారు. 'టీవి రంగంలో విప్లవాత్మక మార్పుకు విశేష కృషిని అందించిన రామోజీరావు మరణం సినీ పాత్రికేయ రంగానికి తీరనిలోటు, వారి సంస్థ ఉషాకిరణ్‌లో పని చేసిన నాటి రోజుల నుండి ప్రతి ఇంట నవ్వులు పూయించిన టీవిషో జబర్దస్త్ వరకు వారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు తెచ్చుకుంటూ వారి పవిత్ర ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నా' అంటూ పోస్టులో రాసుకొచ్చారు.

సంబంధిత పోస్ట్