ఉదయం, సాయంత్రం వేళ్లలో స్కూల్ విద్యార్థులను తీసుకెళ్లే ఆటో డ్రైవర్లు, ఆటోలను నడిపే సమయంలో విద్యార్థులపై శ్రద్ధ వహించి, తప్పకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని గద్వాల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ టంగుటూరు శ్రీను అన్నారు. జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ ఇన్స్టిట్యూట్ కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాలతో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు.