గద్వాల పట్టణంలోని డికె బంగ్లాలో క్రియాశీల సభ్యత్వాల నమోదు కార్యక్రమం బుధవారం ప్రారంభించారు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నరేందర్ రెడ్డి. జిల్లాలో మొదటి క్రియాశీల సభ్యత్వం జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి తీసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ తరపున ఎన్నికలలో పోటి చేయడానికి కచ్చితంగా 100 మంది సాధారణ సభ్యత్వం చేసిన వారికి క్రియాశీల సభ్యత్వం వస్తుందన్నారు.