రోడ్డు ప్రమాదంలో బైక్ రైడర్ స్పాట్ డెడ్

70చూసినవారు
రోడ్డు ప్రమాదంలో బైక్ రైడర్ దుర్మరణం చెందిన ఘటన దేవరకద్ర నియోజకవర్గంలో సోమవారం చోటు చేసుకుంది. కొత్తకోట ఎస్ఐ మంజునాథరెడ్డి వివరాలు. రోహన్ (36) అనే బైక్ రైడర్ 2 రోజుల క్రితం బెంళూరు నుంచి హైదరాబాదుకు వచ్చాడు. తిరుగు ప్రయాణంలో బెంగళూరుకు వెళ్తుండగా ముమ్మాలపల్లి గ్రామం వద్ద నేషనల్ హైవేపై స్పీడ్ కంట్రోల్ చేయలేక రోడ్ సైడ్ ఉన్న కల్వర్టును ఢీ కొట్టాడు. దీంతో 20 మీటర్ల దూరంలో ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్