దేవరకద్ర: అక్రమంగా ఎర్రమట్టి తరలింపు

68చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలం, నెల్లికొండి శివారులో ఎర్ర మట్టి అక్రమ రవాణా జోరుగా సాగుంతుందని స్థానికులు వాపోయారు. శుక్రవారం పట్టపగలే ఎర్ర మట్టిని కొందరు అక్రమంగా తరలిస్తున్నా, అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ, ప్రకృతి సంపదను కొల్లగొడుతున్న అక్రమార్కులకు అధికారులు కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్