మరికల్ మండలం తీలేరు స్టేజీ సమీపంలో బుధవారం రాత్రి రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో బైక్ ఫై వెళ్తున్న కురుమూర్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు. దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట మండలం దమాగ్నాపూర్ కు చెందిన కురుమూర్తి మరికల్ లోని ప్రైవేట్ బ్యాంకులో విధులు నిర్వహిస్తున్నాడు. తిరుగు ప్రయానంలో అతడి బైక్ ను ఢీకొంది. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ కు తరలించారు.