ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ బోల్తా పడి నలుగురికి గాయాలైన ఘటన శుక్రవారం దేవరకద్ర మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం. నాగారం శివారులోని వాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్రమ ఇసుక తవ్వకాలపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.