మహబూబ్ నగర్ లో భారీగా ట్రాఫిక్ జామ్

70చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ చౌరస్తా, అశోక్ టాకీస్ చౌరస్తా, టీడీ గుట్ట ప్రాంతాలలో శుక్రవారం సాయంత్రం నుంచి భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. శనివారం దసరా పండగ సందర్భంగా పట్టణ ప్రజలతో పాటు వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలతో రోడ్లన్ని కిటికీటలాడుతున్నాయి. పట్టణంలోని పలు షాపింగ్ మాల్ ఎదుట వాహనాల రద్దీ నెలకొంది. రద్దీ కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్