మహబూబ్ నగర్: రైతుబంధు కంటే బోనస్ బాగుందంటున్నారు

64చూసినవారు
రైతుబంధు కంటే బోనస్ పై మంత్రి తుమ్మల నాగేశ్వరావు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న రైతు పండుగలో శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుబంధు కంటే సన్నవడ్లకు క్వింటాకు రూ. 500 బోనస్ బాగుందని రైతులు అంటున్నారని ఆయన చెప్పారు. ఒక్కో రైతుకు దాదాపు రూ. 15వేల వరకు బోనస్ వస్తోందన్నారు. ఈ రెండింటిలో రైతుకు ఏది మేలు అనిపిస్తే అదే అమలు చేస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్