గురుకుల విద్యార్థులకు సరైన వసతులు కల్పించాలని బీజేపీ డిమాండ్
దరూర్ మండలం ర్యాలంపాడు గ్రామం మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో నాణ్యత లోపాలపై వచ్చిన ఫిర్యాదుల నేపధ్యంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి డికె. స్నిగ్దా రెడ్డి పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ 600 మంది విద్యార్థులకు కేవలం 6 బాత్రూం మాత్రమే ఉండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వసతులను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు.