మాలల ఆత్మగౌరవ సభను విజయవంతం చేద్దాం
ఈ నెల 27వ తేదీన నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో నిర్వహించబోయే మాలల ఆత్మగౌరవ సభను విజయవంతం చేద్దామని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక మాల మహానాడు నాయకులు పిలుపునిచ్చారు. అలంపూర్ కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి మాలలు పెద్ద ఎత్తున హాజరు కావాలన్నారు. ఆత్మగౌరవ సభకు సంబంధించిన పోస్టర్ ను గురువారం అయిజ పట్టణ కేంద్రంలో అంబేద్కర్ చౌక్ లో ఆవిష్కరించారు.