వర్షం నీరుతో నిండి ఉన్న రోడ్డు..పట్టించుకోని ఉన్నత అధికారులు

82చూసినవారు
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండల పరిధిలో గల బింగి దొడ్డి గ్రామంలో రోజూ కురుస్తున్న వర్షాల కారణంగా గ్రామంలో ప్రధాన రోడ్లతో పాటు సందులు మొత్తం బురదమయం అయ్యాయి. దీనితో దోమలు విపరీతంగా సంచరిస్తున్నాయి. ప్రజలు, చిన్న పిల్లలు, వృద్దులు సీజనల్ వ్యాధుల బారిన పడి రోజు హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు. రాత్రి వేళల్లో మరీ దారుణంగా ఇండ్లలోకి దోమలు చేరి నిద్ర హారాలు లేకుండా చేస్తున్నాయి అని గ్రామ ప్రజలు తెలిపారు.

సంబంధిత పోస్ట్