వీరభద్రప్ప కుటుంబసభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే
జోగులంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం అయిజ మండలం ఎక్లాస్పురం గ్రామంలో తెలంగాణ ఉద్యమకారుడు పురం వీరభద్రప్ప మరణించిన విషయం తెలుసుకున్న మరుక్షణమే శాసనసభ్యులు విజయుడు వీరభద్రప్ప ఇంటికి వెళ్లి వారి కుటుంబసభ్యులను పరామర్శిస్తూ వారికి ధైర్యం తెలియజేస్తూ భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే వెంట వావిలాల రంగారెడ్డి, పుష్ప నరసింహారెడ్డి, తదితరులు ఉన్నారు.