ఫతేపూర్ గ్రామాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

68చూసినవారు
ఫతేపూర్ గ్రామాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
ప్రజలు డెంగ్యూ, ఇతర జ్వరాల బారిన పడకుండా గ్రామాల్లో నిరంతరం పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. శుక్రవారం ఆమె మహబూబ్ నగర్ మండలం ఫతేపూర్ గ్రామాన్ని ఆకస్మికంగా సందర్శించి గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించారు. ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చదవడం, రాయడాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు.

సంబంధిత పోస్ట్