మహబూబ్ నగర్: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలి

72చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స్య సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు మాట్లాడుతూ.. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. మత్స్యశాఖకు 3000 కోట్ల రూపాయలు కేటాయించి వివిధ పథకాల ద్వారా మత్స్యకారులను ఆదుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్