మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండల కేంద్రంలో కురిసిన భారీ వర్షాలకు ప్రభుత్వ ఆరోగ్య ఉప కేంద్రం (పీహెచ్సి) ప్రాంగణంలో భారీగా వరద నీరు చేరింది. దీంతో ఆరోగ్య ఉప కేంద్రం చెరువును తలపిస్తుంది. ఈ మేరకు రోగులకు మిడ్జిల్ పాత గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం తాత్కాలికంగా ఏర్పాట్లు చేశారు.