బంగ్లాదేశ్ లో హిందువుపై, హిందూ దేవాలయాలపై అల్లరిమూకల దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని హిందూ ఐక్యవేదిక నాయకులు వెల్లడించారు. శుక్రవారం సంఘ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ. హిందువులపై దాడులకు నిరసనగా శనివారం మహబూబ్ నగర్ పట్టణ బందుకు పిలుపునిస్తున్నట్టు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపం నుంచి ఉదయం 9: 00 గంటలకు నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నామని అన్నారు.