కల్వకుర్తి: నిజాయితీ చాటుకున్న బస్సు పాస్ ఇన్ ఛార్జి మల్లయ్య

74చూసినవారు
కల్వకుర్తి: నిజాయితీ చాటుకున్న బస్సు పాస్ ఇన్ ఛార్జి మల్లయ్య
కల్వకుర్తి బస్టాండ్ లో బస్సు పాస్ కౌంటర్ ముందు మంగళవారం సాయంత్రం లింగసానిపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ పర్సు పడిపోయింది. ఇది గమనించిన కండక్టర్ మల్లయ్య ఆ పర్సు తీసుకొని చూడగా నాలుగు వేల రూపాయలు నగదు, ఒక ఫోన్ నెంబర్ల బుక్ ఉన్నవి. అందులో ఉన్న ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయగా లింగసానిపల్లి గ్రామానికి చెందిన మహిళ పర్సుగా గుర్తించారు. బుధవారం ఉదయం ఆ మహిళకు ఫోన్ చేసి పిలిచి 4 వేల రూపాయల నగదును బస్టాండ్ లో అందజేశారు.

సంబంధిత పోస్ట్