అందత్వ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిందని ఈ కార్యక్రమాన్ని ప్రజలు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కల్వకుర్తి మండల ఎంపిపి సామ మనోహర్ చెన్నకేశవ అన్నారు. సోమవారం మండల పరిధిలోని జీడిపల్లి గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్నీ ఆమె లాంచనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, కంటి వెలుగు సిబ్బంది, క్యాంపు వైద్యులు, ఆప్తోలోమిస్ట్ జగదీశ్వర్, డాటా ఎంట్రీ ఆపరేటర్ శివకుమార్, సూపర్వైజర్ శ్రీనివాసులు, ఏఎన్ఎం షాహిన్, ఆశ వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.