వెల్దండ మండలం కొట్ర చౌరస్తాలో శుక్రవారం మధ్యాహ్నం పోలీసులు తనిఖీ చేస్తుండగా బైక్ పై అనుమానంగా తిరుగడడం తో ఆపి తనిఖీ చేయగా కొంత బంగారం దొరికినది. అతడిని విచారించగా అల్లం శివ తండ్రి పర్వతాలు, వయసు 27 కులం ఉప్పరి, గ్రామం రామకృష్ణ గుడిసెలు, బతుకమ్మ కుంట, అంబర్ పేట్ హైదరాబాద్ అని తెలిపాడు. అతను నుంచి 18తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు సి. ఐ విష్ణువర్ధన్ రెడ్డి ఎస్సై కురుమూర్తి తెలిపారు.