కొల్లాపూర్: మధ్య దళారులతో మోసపోవద్దు: మంత్రి జూపల్లి
వరి పంట రైతులు మధ్య దళారులతో మోసపోవద్దని తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారము పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్, జొన్నలబొగూడ, చంద్రకల్ గ్రామాలలో వరి కనుగోలు కేంద్రాన్ని పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు ప్రారంభించారు. రైతులు పండించిన వరి ధాన్యం యొక్క తేమ శాతం పరిశీలన చేసి, కాంట చేసిన వేంబడే ప్రతి ఒక్క రైతుకు రషీదు ఇవ్వాలన్నారు.