కొల్లాపూర్: వాహనాల పార్కింగ్ పనులు ప్రారంభం

65చూసినవారు
కొల్లాపూర్ మండలం సోమశిల క్షేత్రానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం మౌలిక వసతులు కల్పించాలని ఇటీవల మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించడంతో శుక్రవారం వాహనాల పార్కింగ్ పనులను పర్యాటక శాఖ జిల్లా అధికారి నరసింహ ప్రారంభించారు. క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. స్నానపు గదులు, తాగునీటి వసతి, మూత్రశాలల పనులను త్వరగా పూర్తి చేస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్