జాతివిత మహాత్మా గాంధీ 155వ జయంతి సందర్భంగా బుధవారం మహబూబ్ నగర్ జిల్లా గడియారం చౌరస్తాలో గాంధీజీ విగ్రహానికి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ శాంతి, అహింసా గాంధీజీ చూపిన మార్గాలని, మానవ మనుగడకు ఆదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.