బీజేపీ రాష్ట్ర నాయకులు, జిల్లా ఇంచార్జ్ చింతల రామచంద్రారెడ్డి శనివారం ఆత్మకూర్ అమరచింత నర్వ మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా నర్వలో ఆయనను ఎద్దుల బండిపై ఊరేగింపుగా తీసుకెళ్లారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. బూత్, గ్రామ, మండలాల నూతన కమిటీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు.