కృష్ణ: జాతర ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయాలి

65చూసినవారు
కృష్ణ మండల కేంద్రంలో శ్రీ క్షీరలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, అన్ని ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని రైతు వేదికలో అధికారులు, ఆలయ కమిటీ సభ్యులతో జాతర ఉత్సవాల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఉత్సవాలకు చేపట్టాల్సిన పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్