మాగనూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా మధ్యాహ్న భోజన కార్మికులకు తొలగించడం సరైన చర్య కాదని మధ్యాహ్న బోజన కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రేమ పావని, ప్రధాన కార్యదర్శి విజయలక్ష్మి అన్నారు. శుక్రవారం పాఠశాలను సందర్శించేందుకు వెళ్లిన తమను అధికారులు అనుమతించకపోవడం సరైన విధానం కాదని అన్నారు. తొలగించిన కార్మికులను వెంటనే తిరిగి తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు.